నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ

నెల్లూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం, డిసెంబర్ 1న జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల రద్దు చేశారు. జిల్లాలో అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.