VIDEO: "దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి"

VIDEO: "దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి"

HNK: పట్టణ కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో శనివారం బయటి వ్యక్తులు మద్యం మత్తులో MBA విద్యార్థి గజేంద్ర పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ ఆదివారం సాయంత్రం విద్యార్థులు యూనివర్సిటీ గేటు ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు మాట్లాడుతూ.. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.