నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం

NZB: బోధన్ పట్టణంలోని గంజ్ కాలనీకి చెందిన యాదమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య ఖర్చుల సహాయార్థం యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ అబ్బోల్ల శ్రీకాంత్ కొందరి సాయంతో రూ.45000 జమ చేసి బాధిత కుటుంబానికి శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.