ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్
KRNL: ఆస్పరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల స్పెషల్ ఆఫీసర్ చిరంజీవి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వైద్య సిబ్బంది హాజరు, మందుల నిల్వలను పరిశీలించారు. రోగులకు సమయానికి సేవలు అందించాలని శుభ్రతపై శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో MRO రామేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.