భవన నిర్మాణ కార్మికులకు స్వచ్ఛతపై అవగాహన
ప్రకాశం: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాల భాగంగా కనిగిరి పట్టణంలోని నాజ్ సెంటర్‌లో మునిసిపల్ కమిషనర్ శ్రీధర్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు, పట్టణ ప్రజలకు తడి-పొడి చెత్త వేరు చేయడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం పై శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నాయబ్ రసూల్ వివరించారు.