కార్యకర్త కుటుంబానికి అండగా టీడీపీ
AP: శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ వేంకటేశ్వస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా అందజేసింది. ఈ మేరకు మంత్రి లోకేష్ సంతకంతో కూడిన బీమా చెల్లింపు సమాచార లేఖను మంత్రి అచ్చెన్నాయుడు బాధిత కుటుంబానికి స్వయంగా అందజేశారు.