VIDEO: సెల్ టవర్ వద్దంటూ మహిళలు రాస్తారోకో
KMM: ఖమ్మం 9వ డివిజన్ టేకులపల్లి బైపాస్ రోడ్డుపై ఇవాళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీఆర్ గ్రాండ్ హోటల్‌పై సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. స్థానిక మహిళలు రాస్తారోకో చేపట్టారు. టవర్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా రహదారిపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.