రూ. 31 లక్షల కట్నం రిటర్న్.. రియల్ హీరో!
యూపీలోని ముజాఫర్‌నగర్‌లో ఓ పెళ్లి కొడుకు గొప్ప మనసు చాటుకున్నాడు. వధువు కుటుంబం కోవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయినా, కష్టపడి రూ.31 లక్షల కట్నం సిద్ధం చేసింది. కానీ ఆ వరుడు 'ఈ డబ్బు తీసుకునే హక్కు నాకు లేదు' అంటూ కట్నాన్ని తిరస్కరించాడు. బలవంతం చేసినా.. ఆస్తిపాస్తులు కాదు, అమ్మాయి చాలు అంటూ కేవలం రూ.1 మాత్రమే తీసుకుని అందరితో శభాష్ అనిపించుకున్నాడు.