'ఆయిల్ పామ్ సాగుతో నిరంతర ఆదాయం'

NZB: సిరికొండ మండలం తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును పలు రకాల సబ్సిడీలతో ప్రోత్సహిస్తోందని శుక్రవారం వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ పంటను ఒకసారి నాటితే నాలుగేళ్ల తర్వాత ప్రారంభమై 30 సంవత్సరాల పాటు నిరంతర ఆదాయాన్ని ఇస్తుందని వివరించారు. కోతులు, పందులు, దొంగల బెడద లేకుండా తక్కువ కూలీలు అవసరమయ్యే లాభదాయక పంట ఆయిల్ పామ్ అని పేర్కొన్నారు.