VIDEO: జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన రాకపోకలు
తిరుపతి జిల్లాలో రాత్రి నుంచి వర్షం దంచికొడుతోంది. ఓజిలి మండలంలో మామిడి కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నెమళ్లపూడి-పున్నేపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దొరవారిసత్రం (V) పూలతోట పెన్నా కాలువ వద్ద బ్రిడ్జిపైకి నీరు చేరింది. సూళ్లూరుపేట-కోట మధ్య రాకపోలు ఆగిపోయాయి. మరికొన్ని చోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి.