సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
AKP: ఎలమంచిలి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఉదయం ఎలమంచిలి టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీటిని పరిశీలించిన ప్రగడ అర్జీదారులతో మాట్లాడుతూ..సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.