ఘనంగా టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జనగామ: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో నేడు టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పుట్ట రజనీకాంత్ ప్రారంభించారు. కార్యకర్తలతో కలిసి టీడీపీ పార్టీ జెండాను ఎగుర వేశారు. అనంతరం పట్టణ ప్రజలకు మహ అన్నదానం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు మాదిరెడ్డి ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.