23 ఎలక్ట్రికల్ ఆటోల పంపిణీ
CTR: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శాంతిపురం మండలంలోని 23 పంచాయతీలకు రూ.80.5 లక్షలు విలువైన 23 ఎలక్ట్రికల్ ఆటోలను కేటాయించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా పంచాయతీ కార్యదర్శులకు వీటిని అందజేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో ప్రతి పంచాయతీకి ఆటోలను ఇచ్చారన్నారు. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చెయ్యాలన్నారు.