రేపు డయల్ యువర్ డీఎం

W.G: తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో మంగళవారం ఉదయం 11 నుంచి 12గంటల వరకు డయల్ యువర్ డీఎం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ దానమ్మ సోమవారం తెలిపారు. కార్గో, ప్రయాణీకుల సమస్యలు, సిబ్బంది తీరు, ఆధ్యాత్మిక యాత్రలు, విహార యాత్రలు తదితర సమస్యలపై ప్రజలు, ప్రయాణికులు ఫిర్యాదులు ఇవ్వవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.