శిశు గృహాల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు

శిశు గృహాల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు

ATP: జిల్లాలోని బాల సదనం, శిశు గృహాల్లో నివసిస్తున్న చిన్నారులకు డీఈఐసీ బృందం ఇవాళ సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఇన్‌ఛా‌ర్జ్ డీఎంహెచ్ఓ డా.విష్ణుమూర్తి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో 21 మంది పిల్లలకు స్క్రీనింగ్ చేశారు. ఆరోగ్య సమస్యలు గుర్తించిన చిన్నారులను తదుపరి చికిత్స కోసం జీజీహెచ్‌లోని డీఈఐసీ విభాగానికి సూచించారు.