విదేశీ వృత్తి నిపుణుల కోసం రష్యా కొత్త వీసా!

విదేశీ వృత్తి నిపుణుల కోసం రష్యా కొత్త వీసా!

విదేశీ వృత్తి నిపుణులను ఆకర్షించేందుకు రష్యా సరికొత్త వీసాను ప్రకటించింది. ఈ కొత్త వీసా కింద కొన్ని రంగాల నిపుణులకు ఆ దేశంలో మూడేళ్లపాటు తాత్కాలిక లేదా శాశ్వత నివాసం పొందే అవకాశం కల్పిస్తోంది. అయితే 2026 ఏప్రిల్ 15 నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్, రష్యా మొబిలిటీ ఒప్పందాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.