వైద్య పరీక్షలు చేయించుకున్న జిల్లా కలెక్టర్

వైద్య పరీక్షలు చేయించుకున్న జిల్లా కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తిలోని ముస్లిం షాదీఖానాలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే బీపీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరాన్ని పాత్రికేయులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.