వాట్సాప్ గ్రూప్ నిర్వాహకులు జాగ్రత్త..!
ములుగు జిల్లాలో ఎన్నికల కోడ్ ప్రస్తుతం అమలులో ఉంది. దీంతో వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్న వారితో పాటు, గ్రూప్ అడ్మిన్గా ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనవసరమైన, వివాదాస్పదమైన, మతపరమైన, వ్యక్తిగత ఇబ్బందులు కలిగించే విషయాలను ఫార్వర్డ్ చేసి సమస్యలను కొనితెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. కేసులపాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు.