తిరుపతి జాతర.. నేడు బండ వేషం

తిరుపతి జాతర.. నేడు బండ వేషం

TPT: తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా భక్తులు గురువారం బండ వేషం వేస్తారు. శరీరమంతా రక్తం చిందినట్లు కుంకుమ పూసుకుంటారు. కాటుక బొట్లు, తెల్లటి పూలు చుట్టుకుని అందరూ వేషాలు వేస్తారు. బొరుగుల హారాలు చుట్టుకుని కర్రలు, వేపాకు చేత పట్టి బూతులు తిడుతూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుకుంటూ ఆలయానికి చేరుకుంటారు.