కనకమహాలక్ష్మి అమ్మవారికి తులసీ దళార్చన

కనకమహాలక్ష్మి అమ్మవారికి తులసీ దళార్చన

VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో శనివారం వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి తులసీ దళార్చనలు చేపట్టారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజల్లో ఒక ఉభయ దాత పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు.