ఈనెల 12న జిల్లాస్థాయి యువకళాకారుల ఎంపికలు

ఈనెల 12న జిల్లాస్థాయి యువకళాకారుల ఎంపికలు

MHBD: జాతీయ యువజనోత్సవాల సందర్భంగా జిల్లాస్థాయి యువకళాకారుల ఎంపికలను ఈనెల 12న జరగనున్నట్లు యువజన క్రీడల శాఖ జిల్లా అధికారి ఓలేటి జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ వద్దగల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు బుధవారం ఉ.9గం.ల నుంచి నిర్వహించబడునని తెలిపారు. అభ్యర్థులు 15- 29 సం.లోపు ఉండాలని, మరిన్ని వివరాలకు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.