ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

GNTR: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు పెరుగుతోంది. ఎడతెరిపిలేని వర్షాలకు ఎగువ నుంచి బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 6,46,821 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద నీటి మట్టం 16 అడుగులు ఉండగా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.