జనాభా గణన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ
కృష్ణా: జనాభా గణన–2027కు సంబంధించి గుడివాడ పురపాలక సంఘం పరిధిలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. పురపాలక సంఘం పరిధిలో మొత్తం 36 మంది సూపర్వైజర్లు, 216 మంది ఎన్యూమరేటర్లు ఎంపిక అయ్యారని మున్సిపల్ కమిషనర్ మనోహర్ అన్నారు. జనాభా గణన రెండు దశల్లో నిర్వహించబడుతుందని, మొదటి దశలో ఇళ్ల గణన, 2వ దశలో జనాభా గణన జరుగుతుందన్నారు.