పాడేరులో GCC ఛైర్మన్ ప్రజాదర్బార్
ASR: గ్రామాల మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. గురువారం పాడేరు తన క్యాంప్ ఆఫీస్‌లో ఛైర్మన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ మేరకు పలు మండలాల ప్రజలు వారి గ్రామాలలో రోడ్లు, వంతెనల నిర్మాణాలకు వినతుల అందించారు. పాఠశాలల్లో సదుపాయాలు, ఖాళీ టీచర్ పోస్టుల భర్తీలకు ఉపాధ్యాయులు వినతి ఇచ్చారు.