VIDEO: విభిన్న ప్రతిభావంతులకు సహాయక ఉపకరణాల పంపిణీ
E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద విభిన్న ప్రతిభావంతులకు సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఉమా ఎడ్యుకేషనల్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేసీ వై.మేఘా స్వరూప్ వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు.