రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
BDK: పినపాక మండలం జగ్గారం పంచాయతీ వెంకటేశ్వరపురం ప్రధాన రహదారి కూడలిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని, వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన పొనగంటి సమ్మయ్య బాధితుడుగా గుర్తించారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.