భద్రాద్రి జిల్లాకు రెండో జాతీయ రహదారి
BDK: హైదరాబాద్- భద్రాద్రి జిల్లాల మధ్య ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించే జాతీయ రహదారి (930P) నిర్మాణ పనుల్లో కీలక ముందడుగు పడింది. ఇల్లెందు నుండి కొత్తగూడెం మధ్య భూసేకరణకు సంబంధించి కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 4.85 హెక్టార్ల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.