పేకాట శిబిరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్
KKD: కాకినాడ మండలం నేమాం గ్రామశివారు శ్మశానవాటిక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జూదం ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ గణేష్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 1600 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో జూదం, కోడిపందేల నిర్వహణపై గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు.