'ప్రజలు పాలకుల మధ్య వారధిగా ప్రజా దర్బార్'

'ప్రజలు పాలకుల మధ్య వారధిగా ప్రజా దర్బార్'

VZM: చీపురుపల్లిలో MLA కిమిడి కళా వెంకటరావు మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్చార్‌ నిర్వహించారు. ప్రజలకు, పాలనకు మధ్య వారధిగా నిలిచే ఈ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఒక చక్కటి వేదిక అని అన్నారు. ఈ మేరకు రేషన్‌ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్యం, రోడ్లు, డ్రైనేజీ, ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం వంటి సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు.