మద్యానికి బానిసై తల్లిని చంపిన కొడుకు
KMM: తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో మద్యానికి బానిసై తల్లిని కొడుకు చంపిన ఘటన చోటుచేసుకుంది. తాపీ పనులు చేసే మధు మద్యానికి బానిసై తల్లి, భార్యను తరచూ వేధించేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి డబ్బుల కోసం తల్లి బూబమ్మ(55)తో వాగ్వాదానికి దిగి కర్రతో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.