జీవీఎంసీ అభివృద్ధిపై పట్టణ అధ్యయన బృందం ఆరా
VSP: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 51వ అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లో భాగంగా పట్టణ అధ్యయన బృందం విశాఖకు వచ్చింది. ఈ బృందం మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ను కలిసింది. నగర అభివృద్ధి, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, జీవీఎంసీ చేపడుతున్న చర్యలను అధికారుల ద్వారా బృందానికి వివరించారు.