VIDEO: పాఠశాలలో ల్యాప్ టాప్‌లు పంపిణీ చేసిన MLA
KMR: బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ బాలుర పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు కామారెడ్డి MLA కాటిపల్లి వెంకటరమణారెడ్డి ల్యాప్ టాప్‌లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ల్యాప్ టాప్‌లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు ఉపాధ్యాయుల కోరిక మేరకు అందించినట్లు తెలిపారు.