కుక్క కాటుతో విద్యార్థికి గాయాలు

E.G: కడియం మండలం జక్కంపూడి నగర్‌కు చెందిన శ్యామ్ అనే విద్యార్థి బుధవారం సాయంత్రం కుక్క కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జక్కంపూడి నగర్‌లో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, వాటిని నియంత్రించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.