కూరగాయల తోటలపై రైతులకు అవగాహన సదస్సు

కూరగాయల తోటలపై రైతులకు అవగాహన సదస్సు

JGL: జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జీ. శ్యాం ప్రసాద్ భీమారం మండలంలోని లింగంపేట, దేశాయిపేట, గోవిందారం గ్రామాల్లో కూరగాయ తోటలను పరిశీలించారు. చీడపీడల నివారణపై రైతులకు సూచనలు ఇచ్చారు. దఫాల వారీగా విత్తితే, విభిన్న కూరగాయలు నాటితే మంచి ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.