ఎన్నికల ఏర్పాట్ల పర్యవేక్షణ

ఎన్నికల ఏర్పాట్ల పర్యవేక్షణ

SRCL: జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్ సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్లోని రిజిస్టర్లను, కంట్రోల్ రూమ్‌లోని ఫిర్యాదుల రిజిస్టర్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో ఆయన పరిశీలించారు.