అంగస్కల్‌లో గడ్డివాములు అగ్నికి ఆహుతి
KRNL: ఆలూరు మండలం అంగస్కల్ గ్రామంలో రైతు దూదేకొండ శ్రీనివాసులకు చెందిన 4 గడ్డివాములు ఇవాళ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. గడ్డివాములు కాలిపోవడంతో పశువులకు మేత లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలన్నారు.