VIDEO: బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
NLR: ఇందుకూరుపేట మండలం డేవిస్‌పేటలో నెల్లూరు-మైపాడు రహదారి యాగర్ల బ్రిడ్జి పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. రూ.కోటి 40 లక్షలు నిధులు మంజూరు చేయించి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. పనుల్లో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.