తొలిసారి రాజ్యసభ అధ్యక్ష స్థానంలో రాధాకృష్ణన్

తొలిసారి రాజ్యసభ అధ్యక్ష స్థానంలో రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఇవాళ రాజ్యసభకు అధ్యక్షత వహించారు. ఆయన ఛైర్‌లో కూర్చోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో ఆయన సభను ఎలా నడిపిస్తారోనని అంతా ఆసక్తిగా గమనించారు. ఈ అరుదైన సందర్భంగా అన్ని పార్టీల నేతలు, ఎంపీలు ఆయనకు అభినందనలు చెప్పారు. కొత్త బాధ్యతలో రాధాకృష్ణన్ సభను ప్రారంభించారు.