110 ఏళ్ల చరిత్ర.. రేపు 'ఫతే' కార్యక్రమం

110 ఏళ్ల చరిత్ర.. రేపు 'ఫతే' కార్యక్రమం

KRNL: చిప్పగిరిలో 110 ఏళ్ల చరిత్ర కలిగిన భంభం బాబా ఉరుసు ఉత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారని మత పెద్దలు తెలిపారు. మంగళవారం ప్రధాన ఘట్టమైన “ఫతే” కార్యక్రమం జరగనుంది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తిశ్రద్ధలతో ఈ ఉత్సవం జరగనుంది.