రాజిరెడ్డి సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే

మేడ్చల్: ఉప్పల్ బండారి రాజిరెడ్డి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం డా. ఏఎర్రావునగర్ డివిజన్ పరిధి సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సంతాప సభకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. తన తుదిశ్వాశ వరకు ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి రాజిరెడ్డి అని, ఆయన మరణం అందరికీ తీరని లోటన్నారు.