రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
SRD: అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన సదాశివపేట పట్టణం పరిధిలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి బొంబాయి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారు సదాశివపేట బైపాస్‌లో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనానికి ఢీకొట్టింది. దాంతో కారులో ఉన్న ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.