పదవీ విరమణ పొందిన ఎస్సై విజయ భాస్కర్‌కు సన్మానం

పదవీ విరమణ పొందిన ఎస్సై విజయ భాస్కర్‌కు సన్మానం

KRNL: కమ్యూనికేషన్ ఎస్సై ఎస్. విజయ భాస్కర్ పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ASP అడ్మిన్ హుస్సేన్ పీరా, కమ్యూనికేషన్ ఇన్ స్పెక్టర్ రమేశ్ శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. పదవీ విరమణ తరువాత కుటుంబసభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని అధికారులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో DCRB సీఐ గుణశేఖర్ బాబు ఉన్నారు.