ఎస్పీ ఆదేశాలతో వాహనాలు క్రమబద్ధీకరణ
VZM: జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆదేశాలతో భోగాపురం పోలీసు స్టేషన్ పరిధిలోనీ రాజాపులోవ జంక్షన్‌లో తుఫాన్ నేపథ్యంలో వర్షం నీరు రోడ్డుమీద ప్రవహిస్తుంది. దీంతో ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా రోడ్డును మూసివేశారు. బుధవారం వర్షం నీరు తగ్గడంతో సీఐ కె. దుర్గా ప్రసాద్ , సిబ్బంది దగ్గర ఉండి వాహనాలను నెమ్మదిగా క్రమబద్ధీకరించారు.