రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు(M) గాంధీపురం సమీపంలో 42వ హైవేపై ఉదయం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పెద్దపంజాని(M) వీరప్పల్లి గ్రామానికి చెందిన శివకుమార్ (27), కుదవపల్లి గ్రామానికి చెందిన ఆంజప్ప (45) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి, గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.