ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

చిత్తూరు: సెలవుల్లో ఊరికి పంపలేదని ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన శనివారం తంబళ్లపల్లెలో చోటుచేసుకుంది. బలకవారిపల్లె హరిజనవాడకు చెందిన వెంకటప్ప కుమారుడు బి.శ్రీరాములు(15) కురబలకోటలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో వాల్మీకిపురంలోని బంధువుల ఇంటికి వెళ్లాలని కోరగా ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.