కుమ్మరపల్లిలో తాగునీటి సమస్య తీర్చాలంటు వినతి

కడప: తాగునీటి సమస్య తీర్చాలంటూ సంబేపల్లి మండల పరిధిలోని రౌతుకుంట గ్రామం కుమ్మరపల్లి వాసులు సోమవారం మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. నెల రోజులుగా గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రమైందన్నారు. వ్యవసాయ బోర్ల నుంచి కూడా నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు మండుతుండడంతో మూగ జీవాలు సైతం తాగునీటి కోసం అవస్థలు పడుతున్నట్లు తెలిపారు.