లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుమేహ నిర్ధారణ పరీక్షలు
SDPT: సేవే మనసులోని మహత్తర భావం అని చాటుతూ బెజ్జంకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శనివారం ఉదయం మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైన ఈ శిబిరంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మధుమేహ వ్యాధి లక్షణాలు, దాని నివారణ పద్ధతులు, జీవనశైలిలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.