వారికి మెరుగైన వైద్యం అందించండి: ఎమ్మెల్యే

CTR: శ్రీ రంగరాజపురం మండలం పాపిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో సోమవారం ఉపాధి హామీ కూలీలపై కందిరీగల దాడి చేసి 10 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు.