వేడుకలకు రావాలని రాణాప్రతాప్‌కు ఆహ్వానం

వేడుకలకు రావాలని రాణాప్రతాప్‌కు ఆహ్వానం

WGL: చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన ముదిరాజులు శనివారం ఉదయం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.గోగుల రాణాప్రతాప్‌ను కలిశారు. తమ కుల బంధువులు జరుపుకునే గ్రామ పెద్దమ్మ తల్లి దేవత ప్రతిష్ఠ, యంత్రబలం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావాలని వారు రాణాప్రతాప్‌ను ఆహ్వానించారు. ఈమేరకు ఆహ్వానపత్రిక అందజేశారు.