మాజీ ఎంపీ తల్లికి ఎర్రబెల్లి నివాళి

మాజీ ఎంపీ తల్లికి ఎర్రబెల్లి నివాళి

JNG: చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు డా.రంజిత్ రెడ్డి మాతృమూర్తి చంద్రకళమ్మ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.